Viral News: ప్రేమ కోసం యువకులు ఎంతకైనా తెగిస్తుంటారు. అర్ధరాత్రి అయినా, చీకటి కమ్ముకున్నా, తాము ఆశించిన వారిని కలవాలన్న తపన ఆగదు. అలాంటి ఓ యువకుడి ప్రయాణం మాత్రం గమ్యం చేరకుండానే ఘోరంగా ముగిసింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి గ్రామాల్లో ఇటీవల ‘డ్రోన్ దొంగలు’ తిరుగుతున్నారు అన్న పుకార్లు జోరుగా సాగుతున్నాయి. డ్రోన్లను ఉపయోగించి దొంగలు ముందుగా ఇళ్లను స్కాన్ చేస్తూ, తర్వాత దోపిడీలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా మారారు. అనుమానాస్పదంగా కనిపించే వారెవరికైనా దొంగల ముద్ర వేసే పరిస్థితి నెలకొంది.
అయితే అదే సమయంలో ఓ యువకుడు, తన వివాహిత ప్రియురాలిని కలవాలనే ఉద్దేశంతో, ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి రహస్యంగా గ్రామంలోకి ప్రవేశించాడు. ప్రియురాలితో తన సంబంధం బయటపడకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి వచ్చిన అతను ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Komatireddy Venkata Reddy: మంత్రి కోమటిరెడ్డికి అవమానం
గ్రామస్తులు ఇప్పటికే దొంగల కోసం గస్తీ కాస్తుండగా ఈ ముగ్గురు యువకులు కంటపడ్డారు. వారికి అనుమానం వచ్చి, వీళ్లు డ్రోన్ దొంగలేనని భావించి తక్షణమే దాడికి దిగారు. మరో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోవడంలో విజయం సాధించగా, ప్రేమికుడు మాత్రం స్థానికుల చేతిలో పట్టుబడి తీవ్రంగా మోగినట్లు తెలుస్తోంది.
తరువాత గ్రామస్తులు అతడిని పోలీసులకు అప్పగించారు. గ్రామంలో రాత్రివేళ ఎందుకు వచ్చాడన్న ప్రశ్నకు అతడు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన పట్ల పోలీసులు స్పందిస్తూ – “డ్రోన్లను ఉపయోగించి దొంగలు దోపిడీలు చేస్తున్నారన్న వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ పుకార్లతో అపరాధాలు జరగడం, నిర్దోషులు చితకబడడం విచారకరం” అని అన్నారు.