Crime News

Crime News: వరుడి ముందే వధువుపై సామూహిక అత్యాచారం

Crime News: ఇద్దరు వ్యక్తుల మధ్య నిశ్చితార్థం జరిగి, కొద్ది రోజుల్లోనే వారు వివాహం చేసుకోబోతున్నారు, కానీ పిడుగుపాటులా, కొంతమంది కామపురుషులు వరుడి ముందే ఒక యువతిపై దాడి చేసి అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో ఒక యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం చేశారు. వారు వరుడిని బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారు. నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో వారిద్దరూ రోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిద్దరినీ అక్కడ చూసిన ఒక గుంపు వారి దగ్గరకు వచ్చి వారితో అసభ్యంగా మాట్లాడింది. ఆ తర్వాత వరుడిని బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. దుండగులు వారి వద్ద ఉన్న డబ్బును దోచుకుని పారిపోయారు.

ఇది కూడా చదవండి: Ambedkar Museum: అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి

బాధితురాలు ఫిర్యాదు ప్రకారం, అనేక మంది తనను వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని పేర్కొంది. నిందితుడిని సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసును త్వరిత న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kodali Nani: కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *