Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: టర్బో స్పీడులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌?

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో మునిగిపోయారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను ఇప్పటికే ముగించిన ఆయన, ‘ఓజి’ చిత్రాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు డేట్స్ కేటాయించారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై కూడా పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసేందుకు గట్టి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. జూన్ 12 నుంచి షూటింగ్ నిర్విరామంగా జరపాలని నిర్ణయించారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్‌లో సాగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పవన్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి హరీష్ సిద్ధమవుతున్నారు. తాజా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *