Helicopter Crash

Helicopter Crash: అమెరికాలో దారుణం హెలికాప్టర్ కుప్పకూలి, సీమేన్స్ CEO కుటుంబం మృతి

Helicopter Crash: న్యూయార్క్, ఏప్రిల్ 11: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఆరుగురు ప్రాణాలను బలిగొంది. హడ్సన్ నదిలో జరిగిన ఈ విషాద ఘటనలో, ప్రముఖ జర్మన్ టెక్ దిగ్గజం సీమేన్స్ స్పెయిన్ శాఖ అధ్యక్షుడు CEO అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు చిన్నారులు,  పైలట్ దుర్మరణం చెందారు.

పర్యాటక టూర్ మారణయాత్రగా మారిన ఘోరం
అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న బెల్ 206 మోడల్ హెలికాప్టర్, న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ సంస్థకు చెందినది. ఈ హెలికాప్టర్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డౌన్‌టౌన్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, హడ్సన్ నది మీదుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది.

అయితే, జార్జ్ వాషింగ్టన్ వంతెన సమీపంలోకి చేరుకునే సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా గింగిరాలు తిరిగి తలకిందులుగా నదిలో కుప్పకూలింది. ఈ ఘటనతో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

గాల్లోనే విరిగిపోయిన హెలికాప్టర్..
ప్రమాదానికి కారణంగా హెలికాప్టర్ గాల్లో ఉన్నపుడే దాని వెనుక భాగం విరిగిపడిందని ప్రత్యక్ష సాక్షి బ్రూస్ వాల్ వెల్లడించారు. “హెలికాప్టర్ ప్రొపెల్లర్ ఒక్కసారిగా వేరైపోయి నీళ్లలో పడిపోయింది. అప్పటికే అది పూర్తిగా ఆన్‌ కంట్రోల్‌లో లేకుండా మునిగిపోయింది,” అని తెలిపారు.

Helicopter Crash: ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు బోట్ల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కానీ అప్పటికే హెలికాప్టర్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ఈ ఘటనపై అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ విచారణకు ఆదేశించారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ ప్రకారం, హెలికాప్టర్‌ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు.

Also Read :  China tariffs: చౌకగా చైనా ఎలక్ట్రానిక్ వస్తువులు..

మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందన
ఈ ప్రమాద ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ఘోర సంఘటనలు మానవాళిని కలచివేస్తాయి. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి,’’ అని ఆయన ట్వీట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నదిలో కుప్పకూలుతున్న హెలికాప్టర్ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో కలిసి పర్యటనకు వెళ్లిన కుటుంబం ఇంతటి విషాదానికి గురవడం హృదయవిదారకమైన సంఘటనగా మారింది.

 

ALSO READ  Andhra Pradesh: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం: గిరిజన గురుకులాల్లో చికెన్ నిషేధం

 

 

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *