Urea Case: యూరియా కోసం రైతుల బారులు.. ఎరువు దొరక్క సాగు సమస్యలు.. దిక్కులు చూస్తున్న రైతులు.. ఇదీ తెలంగాణలో అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. క్యూలైన్లలో చెప్పులు, పాస్‌బుక్‌లు పెట్టి రోజంతా ఉన్నా యూరియా దొరకని దుస్థితి ఎదురవుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి దశలో ఓ పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చిన యూరియాను ఓ డైరెక్టర్ ఇంటిలో నిల్వ చేసిన ఘటన వెలుగు చూసింది.
Urea Case: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలోని పీఏసీఎస్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 బస్తాల యూరియాను అధికారులు గుర్తించారు. ఒకవైపు యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతుంటే.. ఇలా యూరియాను నిల్వ చేసిన ఉంచడంపై వ్యవసాయాధికారులు స్పందించారు.
Urea Case: యూరియాను అక్రమంగా నిల్వ ఉంచి పీఏసీఎస్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరిపై వ్యవసాయ శాఖ అధికారులు సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచి యూరియా బస్తాలను సీజ్ చేశారు. ఈ ఘటన వెలుగు చూడటంపై రైతులు అవాక్కయ్యారు. తమకు యూరియా దొరక్క అవస్థలు పడుతుంటే.. రైతులకు సేవలంందించాల్సిన ఓ డైరెక్టర్ ఇలా అక్రమంగా నిల్వ చేయడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.