ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్ పరిశ్రమలో పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడి బీహార్ నుండి 2 కేజీ ల ఎండు గంజాయి ని తీసుకువచ్చి విక్రయిస్తున్న సమయంలో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించమన్నారు.
ఉప్పల్ మెట్రోరైలు స్టేషన్ దగ్గర భిక్షాటన,లేబర్ పని చేసుకుంటూ జీవిస్తున్న లాలయ్య అనే వ్యక్తి ని అక్కడే భిక్షాటన,లేబర్ పని చేసే రమేష్ అనే వ్యక్తి లాలయ్య ను కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు రమేష్ ని రిమాండ్ కు తరలించారు.
ఉప్పల్ పొలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో మొబైల్ పోన్ లు చోరీలు లు జరిగిన 16 మొబైల్ పోన్ లు రికవరీ చేసి ఐఎంఈఐ నంబర్ ల ద్వారా 16 మందికి మొబైల్ పోన్ లు అందజేశారు.వాటి విలువ సుమారు 3,20,000 ఉంటుందని తెలిపారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీ చేసే అంబర్ పెట్ కు చెందిన ముదావత్ శంకర్ ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 1,20,000 విలువ కలిగిన 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

