UPI New Rules

UPI New Rules: ఆటో పే ఆ టైం లో పనిచేయదు.. ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్‌

UPI New Rules: డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ సేవలపై కొత్త నిబంధనలు అమలు చేయబోతోంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. ఇవి ఎందుకు తెచ్చారు? యూపీఐను మరింత వేగంగా, విశ్వసనీయంగా మార్చడమే ఈ మార్పుల వెనక ఉద్దేశం.

ఇప్పుడు ఈ కొత్త రూల్స్ ఏంటో సింపుల్‌గా చూద్దాం.

రూల్ 1: బ్యాలెన్స్ చెకింగ్‌కు పరిమితి

ఇకపై ఒక యాప్‌లో రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. మీరు పేటీఎం, ఫోన్ పే రెండింటినీ ఉపయోగిస్తే, రెండు యాప్‌లలో విడిగా 50-50 సార్లు చెక్స్ చేయవచ్చు. పీక్ అవర్స్‌లో (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు) బ్యాలెన్స్ చెక్ ఆపేస్తారు. ఈ సమయంలో లావాదేవీ జరిగిన తర్వాత బ్యాంకు ఆటోమేటిక్‌గా మీ బ్యాలెన్స్ వివరాలు పంపుతుంది.

రూల్ 2: ఆటోపే ఇకపై రద్దీ లేని సమయాల్లోనే

OTT సబ్‌స్క్రిప్షన్స్, EMIలు, SIPలు, బిల్లులు – ఇవన్నీ ఇకపై నాన్ పీక్ అవర్స్‌లోనే ప్రాసెస్ అవుతాయి. అంటే: ఉదయం 10 గంటల ముందు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు ఇంకా రాత్రి 9:30 తర్వాత మాత్రమే . ఇలా చేయడం వల్ల యూపీఐ సర్వర్లు రద్దీ సమయంలో స్లో అవ్వకుండా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Ashok Gajapathi Raju: నేడు గోవా కి నారా లోకేష్.. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

రూల్ 3: ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్‌కు పరిమితి

  • ఒక లావాదేవీ పెండింగ్‌లో ఉంటే, వెంటనే పదేపదే స్టేటస్ చెక్ చేయకూడదు.

  • కనీసం 90 సెకన్ల తర్వాత మాత్రమే మొదటి సారి చెక్ చేయాలి.

  • గరిష్టంగా 3 సార్లు మాత్రమే స్టేటస్ చెక్ చేయాలి.

  • ఇంకా సమస్య ఉంటే, కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.

ఎందుకు ఈ మార్పులు?

యూపీఐలో ప్రతి రోజు కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రద్దీ సమయాల్లో సర్వర్లు స్లో అవ్వకుండా, అందరికీ వేగంగా సేవలు అందించడానికి NPCI ఈ మార్పులు తెచ్చింది.

భవిష్యత్తులో చార్జీలు కూడా రావచ్చా?

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం, ఇప్పటివరకు ప్రభుత్వం యూపీఐ ఖర్చును సబ్సిడీగా భరిస్తోంది. కానీ ఇది ఎక్కువ కాలం సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తులో కొంత ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది.

మీరు కూడా యూపీఐ యూజర్ అయితే, ఈ కొత్త మార్పులకు అలవాటు పడండి. స్మార్ట్‌గా లావాదేవీలు చేయండి, పదేపదే చెక్స్ చేసి సిస్టమ్ స్లో అవ్వకుండా జాగ్రత్తపడండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *