Upendra: ప్రయోగాత్మక చిత్రాలు, సెటైరికల్ కథలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఉప్పీ.. ఇప్పుడు స్పీడు పెంచాడు. గత ఐదేళ్లలో నాలుగు సినిమాలు చేసిన ఈ హీరో, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ఇటీవల భార్గవ చిత్రాన్ని ప్రారంభించిన ఉపేంద్ర, తాజాగా నెక్స్ట్ లెవల్ అనే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. తరుణ్ శివప్ప నిర్మాణంలో, అరవింద్ కౌశిక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇవే కాదు, మరో నాలుగు కన్నడ చిత్రాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అటు తమిళంలో రజనీకాంత్‌తో కలిసి లోకేశ్ కనగరాజ్ మల్టీస్టారర్‌లో, ఇటు తెలుగులో ఆంధ్రా కింగ్‌లో కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. 17 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో, మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ.. ఉపేంద్ర జోరు చూపిస్తున్నాడు.
