Upcoming Netflix Movies: ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలుగు సినిమాల కొనుగోలు విషయంలో జోరుపెంచింది. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, యంగ్ హీరోల సినిమాల వరకూ తన స్ట్రీమింగ్ లిస్ట్ లో వేసుకుంటోంది. తాజా ఈ సంస్థ ప్రస్తుతానికి తాము కమిట్ అయిన సినిమాల జాబితాను ప్రకటించింది. అందులో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, ప్రియదర్శి, శివాజీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నో బడీ’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రాలు ఉన్నాయి. నార్నే నితిన్, సంగీత్ శోభన్ ‘మ్యాడ్ స్క్వేర్’, రవితేజ ‘మాస్ జాతర’, నాగచైతన్య ‘తండేల్’, విజయ్ దేవరకొండ 12వ చిత్రం, నాని ‘హిట్ 3’ చిత్రాలనూ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే… ఇందులో చాలా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. మిగిలిన సినిమాలను నెట్ ఫ్లిక్స్ డబ్ చేసి అందర్ లాంగ్వేజెస్ లోనూ స్ట్రీమింగ్ చేయనుంది.
