Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారిన నేవీ అధికారి హత్య

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో ఇటీవల మర్చంచ్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసింది. విదేశాల నుంచి తన కుమార్తె పుట్టిన రోజు కోసం వచ్చిన వ్యక్తిని, అతడి భార్య ముస్కాన్ రస్తోగి, లవర్ సాహిల్ శుక్లాలు కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావద్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ గోండాకు చెందిన ఒక మహిళ, తన భర్త అక్రమ సంబంధానికి అడ్డు చెబుతున్నాడని బెదిరించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భర్తతో పాటు భర్త తల్లిని కూడా చంపేస్తానని బెదిరించింది. సదరు మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నడుపుతోంది. మీరట్ హత్యలాగే నిన్ను కూడా ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేస్తానని భర్తని బెదిరించింది. పోలీసులకు రెండు వైపుల నుంచి ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య జరిగిన హింసాత్మక వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ కర్రలాంటి వస్తువుతో భర్తపై దాడి చేస్తున్నట్లు చూడొచ్చు.

Also Read: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి

ఝాన్సీకి చెందిన ధర్మేంద్ర కుష్వాహా అనే వ్యక్తి ప్రస్తుతం గోండాలోని జల్ నిగమ్‌ పనిచేస్తున్నాడు. ఇతడి భార్య మాయా మౌర్య, ఆమె ప్రేమికుడు నీరజ్ మౌర్య తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. 2016లో బస్తీ జిల్లాకు చెందిన మాయా మౌర్యతో తనకు లవ్ మ్యారేజ్ జరిగిందని కుష్వాహా తెలిపాడు. తమకు కూతురు పుట్టిన తర్వాత తన భార్య పేరు మీద ఉన్న కారు కొని, దానికి ఈఎంఐలు చెల్లిస్తున్నానని తెలిపాడు. 2022లో మాయ పేరుతో ఒక భూమిని కొనుగోలు చేసి, ఇంటి నిర్మాణ కాంట్రాక్టును ఆమె బంధువు నీరజ్ మౌర్యకు ఇచ్చానని కుష్వాహా తెలిపాడు.

ఆ సమయంలో మాయ తన బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకుందని కోవిడ్-19 కాలంలో నీరజ్ భార్య మరణించిన తర్వాత వీరిద్దరి మధ్య సంబంధం మరింత పెరిగినట్లు ఆరోపించారు. జూలై, 2024న తాను మాయ, నీరజ్‌లను అభ్యంతరకమైన పరిస్థితిలో చూశానని, తాను నిరసన తెలిపేందుకు వారు కొట్టారని కుష్వాహా పేర్కొన్నాడు. ఆగస్టు 25, 2024న మాయ నీరజ్‌తో ఇంటికి వచ్చి బలవంతంగా తాళం పగలగొట్టి 15 గ్రాముల బంగారం, నగదులో పారిపోయినట్లు చెప్పారు. ఈ విషయమై కుష్వాహా సెప్టెంబర్, 2024లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మార్చిలో తన తల్లిని చంపుతానని బెదిరించారని, తన తల్లితో పాటు తనను కొట్టినట్లు చెప్పాడు. ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ లాగే, తనను, తన తల్లిని ముక్కలుగా నరికి డ్రమ్‌లో వేస్తానని ఇటీవల బెదిరించిందని భార్యపై కుష్వాహా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ  Hyderabad: రామంతాపూర్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *