Uttar Pradesh

Uttar Pradesh: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Uttar Pradesh: పెళ్లి చేసుకుంది ..పిల్లలను కన్నది. ఇంకొకడిని ప్రేమించింది. వాడితోనే రెండో జీవితం అనుకుంది. ఇరవై ఇండ్లు చిన్నోడైనా ,..మాంచి పోటు గాడని పెళ్ళికి సిద్ధమైంది. మరి మొదట పెళ్లి చేసుకున్న వాడు ఉన్నాడు కదా ..మరి విడి సంగతి ఏంటి ? అడ్డు ఉండకూడదు. అడ్డు తొలగించుకోవాలి అంటే ..ఒక్కటే మార్గం ..చంపేయడం. మరి ఎలా చంపాలి. పక్కాగా స్కెచ్ ఐతే వేసింది …ఆ తర్వాత ఏమైంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పరిధి బితూర్ పట్టణంలో నివసించే ఆబిద్ జాతరలో ఊయల పని చేసి జీవనం సాగించేవాడు. ఆబిద్ కు 20 ఏళ్ల క్రితం షబానా తో వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆబిద్ వృత్తి రీత్యా ఎక్కువగా ఇంటి బయటే ఉండేవాడు.. దీంతో షబానా సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఎక్కువ సమయం గడిపేది. అలా ఫేస్ బుక్ చాటింగ్ లో ఆమెకు రిహాన్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఆన్ లైన్ లో ఫ్రెండ్స్ గా మారి రోజూ గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేవారు. అలా ఇద్దరూ ప్రేమికులుగా మారారు.

Uttar Pradesh: ఆబిద్ ఎలాగూ ఇంట్లో ఎక్కువగా ఉండడు.. పిల్లలు కూడా లేని సమయంలో రిహాన్ కు ఫోన్ చేసి షబానా పిలిచేది. అలా ఇద్దరి మధ్య ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారింది. కానీ షబానా అంతటితో తృప్తి చెందలేదు. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన రిహాన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆబిద్ ఒక ప్రమాదవశాత్తు ఊయల నుంచి కిందపడిపోయి వెన్నుకు గాయం అయింది. దీంతో అతడికి డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పారు. దీంతో షబానా ఇంటికి రిహాన్ రావడానికి అడ్డంకిగా మారింది.

ఇక ప్రేమికులిద్దరూ దూరంగా ఉండలేక తమ బంధానికి అడ్డంగా ఉన్న ఆబిద్‌ను అంతం చేయాలని డిసెంబర్ లోనే ప్లాన్ వేశారు. కానీ భయంతో ముందు వెనుక మధనపడేవారు. ఆబిద్ గాయంతో బలహీనంగా ఉండడం చూసి ఇదే అవకాశంగా భావించారు. అందుకే రిహాన్ తో పాటు అతని స్నేహితుడు వికాస్ సాయం తీసుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న వికాస్.. ఆబిద్ ను హత్య చేసేందుకు రిహాన్, షబానాల వద్ద డబ్బులు తీసుకున్నాడు.

Uttar Pradesh: ఆ రోజు రాత్రి ఆబిద్ తన గదిలో నిద్రపోయి ఉండగా.. రిహాన్, వికాస్ లను తీసుకొని షబానా తన భర్త ఆబిద్ వద్దకు చేరింది. ముందుగా ఆబిద్ ఛాతి భాగంపై షబానా కూర్చొని అతని చేతులు ఆడకుండా గట్టిగా పట్టుకుంది. ఆమె వెనుక రిహాన్ .. ఆబిద్ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. చివరగా వికాస్ అక్కడ చేరి ఆబిద్ గొంతుని 30 నిమిషాల పాటు గట్టిగా నులిమాడు. ఈ క్రమంలో ఆబిద్ తనను చంపవద్దని షబానాను ఎంతో బతిమాలాడు. అయినా షబానా అతడి మాటలు వినలేదు. చివరికి నిస్సహాయ స్థితిలో ఆబిద్ మరణించాడు.

ALSO READ  Maoist party: ఎన్ కౌంటర్ బూటకం.. మావోయిస్ట్ పార్టీ కీలక లేఖ..

ఆబిద్ చనిపోయాడని ధృవీకరించుకున్నాక.. రిహాన్, వికాస్ అక్కడి నుంచి చడీ చప్పుడు చేయకుండా పారిపోయారు. కానీ షబానా ప్లాన్ అంతటితో ముగియలేదు. తన భర్త మృతదేహం ప్యాంటులో 8 వయాగ్రా మాత్రలు, కండోమ్ లు పెట్టింది. ఇదంతా పక్క గదిలో తన పిల్లలు నిద్రపోతుండగానే చేసింది. ఉదయం లేవగానే ఏమీ తెలియనట్లు తన భర్త గదిలోకి వెళ్లి భోరున ఏడ్చింది. తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని పొరుగింటి వారిని, తన తమ్ముడు సలీం కు ఫోన్ చేసింది. షబానా తమ్ముడు సలీమ్ అక్కడికి చేరుకొని చూడగా.. ఆబిద్ చనిపోయాడు. కానీ ఆబిద్ గొంతుపై గట్టిగా నులిమి నట్లు కొన్ని గుర్తులు కనిపించాయి. దీంతో సలీం అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశాడు. షబానా మాత్రం చడీచప్పుడు లేకుండా ఆబిద్ అంతక్రియలు చేయాలని భావించింది.

పోలీసులు ఆబిద్ శవం చూశాక.. సలీం వారితో తనకు కలిగిన అనుమానాన్ని చెప్పాడు. పైగా తన సోదరి షబానాకు రిహాన్ అనే కుర్రాడితో సంబంధం ఉన్నట్లు కూడా చెప్పేశాడు. దీంతో పోలీసులు ఆబిద్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించి.. షబానాని అదుపులోకి తీసుకున్నారు. కానీ షబానా మాత్రం తన భర్త ఎక్కువగా వయాగ్రా టాబ్లెట్స్ తీసుకోవడం వల్లే చనిపోయాడని చెప్పింది. కానీ పోలీసులు మాత్రం తమ పద్ధతిలో ఆమె ప్రశ్నిస్తే.. మొత్తం నిజం బయటపెట్టింది. దీంతో పోలీసులు రిహాన్ ని కూడా అరెస్ట్ చేశారు. కానీ వికాస్ మాత్రం పరారయ్యాడు. మూడు రోజుల పాటు పోలీసులు వికాస్ కోసం గాలించి పట్టుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *