RCBW vs UPW: డబ్ల్యూపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో ఓటమిని ఎదుర్కొంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్, ఆర్సీబి… సరిగ్గా ఒకే పరుగులు చేయగా… సూపర్ ఓవర్‌కు వెళ్లిన మ్యాచ్ లో ఆర్‌సీబీ చివరికి ఓడిపోయింది. 9 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ కేవలం 4 పరుగులే సాధించగలిగింది. యూపీ వారియర్స్ బౌలర్ సోఫీ ఎక్లీస్టోన్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో తన టీమ్‌కు సంచలన విజయాన్ని సాధించడంలో తోడ్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
డబ్ల్యూపీఎల్ చరిత్రలో నిన్న జరిగిన యూపీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్… మొట్టమొదటి సూపర్ ఓవర్ జరిగిన మ్యాచ్ గా రికార్డు సృష్టించింది. ఇక ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ అధ్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఎంపికల్లో తప్పు స్పష్టంగా కనిపించింది.
మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఎల్లిస్ పెర్రీని సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు పంపకపోవడం ఆర్‌సీబీకి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఎల్లిస్ పెర్రీతో పాటు డానీ వ్యాట్‌ను కూడా సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు పంపించి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. ఆర్‌సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్‌లో యూపీ వారియర్స్ కేవలం 8 పరుగులకే తమ వికెట్లను పోగొట్టుకుంది.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఇంటికి వెళ్లిపోయిన పాకిస్తాన్..! న్యూజిలాండ్ చేతిలో ఓడి కొంపముంచిన బంగ్లాదేశ్..!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలగవగా… డానీ వ్యాట్-హోడ్జే 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులతో హాఫ్ సెంచరీలతో టీమ్‌కు మంచి స్కోరును అందించడంలో సహాయపడ్డారు.
అయితే, ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన 6 పరుగులు,, రిచా ఘోష్… ఎనిమిది, కనిక అహుజ ఐదు, జార్జియ వేర్‌హామ్ ఏడు పరుగులతో తమ ఫార్మ్‌ను చూపించలేకపోయారు. యూపీ వారియర్స్ బౌలర్లలో హెన్రీ, దీప్తి శర్మ, తహిల మెక్‌గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు.
తర్వాత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకే పరిమితమైంది… ఇక దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు నడిచింది. యూపీ వారియర్స్ తరఫున శ్వేత సెహ్రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేయగా… సోఫీ ఎక్లీస్టోన్ 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 33 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరి క్షణాల్లో ఎక్లీస్టోన్ మరియు సైమా థకోర్ సిక్సర్లతో స్కోర్‌ను సమం చేశారు.
ఆర్‌సీబీ బౌలర్లలో రేణుక సింగ్ మరియు కిమ్ గార్త్ ఇద్దరూ రెండు వికెట్లు తీశారు, అయితే స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టింది. ఎల్లిస్ పెర్రీ కూడా ఒక వికెట్ తీసింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో కూడా ఆర్‌సీబీ ఇలాగే తృటిలో విజయాన్ని కోల్పోయింది.