UP: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు పిడుగుపాటుకు గురయ్యారు. ఓ చెట్టు కింద నిల్చొని ఉన్న ఐదుగురిపై ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో ఐదుగరు విద్యార్థులు అక్కడికక్కడే కూలిపోయారు. ఆ తర్వాత వారిని తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
UP: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మురాదాబాద్ తీర్థంకర మహవీర్ విశ్వవిద్యాలయంలో ఓ ఐదురురు విద్యార్థులు చెట్టు కింద దారిలో నిలబడి ముచ్చటించుకుంటున్నారు. ఈ సమయంలో వర్షం వస్తుండగా, ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. ఒక్కసారిగా వారున్న చోటే పిడుగు పడింది. దీంతో అక్కడున్న ఐదుగురు అక్కడికక్కడే నేలపై పడిపోయారు. వారిని తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించగా, ఓ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. అయితే అక్కడి సీసీ టీవీ పుటేజీలో పిడుగు పడి విద్యార్థులు నేలకొరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి.