Telangana: సమగ్ర కుటుంబ సర్వే కోసం హైదరాబాద్‌లో ఓ ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఇద్దరిపై ఆ కుటుంబం తమ పైత్యాన్ని చూపింది. బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలో ఓ ఇంటికి ఎన్యుమరేటర్లైన అపురూప, రమ్యశ్రీ వివరాల సేకరణ కోసం వెళ్లారు. ఆ ఇంటిలోని వెళ్లగానే ఆ ఇంటి యజమానులు క్కుక్కలను వదిలారు. అంతేగాకుండా వారితో దుర్భాషలాడారు. సర్వే చేయకుండా అడ్డుకున్నారు.
Telangana: ఆ ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లు సమీపంలోని గతి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో హైదరాబాద్ నగరంలో సర్వేలో పాల్గొనే ఇతర ఎన్యుమరేటర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

