Delhi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ పదవీకాలంలో మొదటిసారిగా కేంద్ర మంత్రి మండలిని సమావేశం చేస్తున్నారు. ఈ సమావేశం “ఆపరేషన్ సిందూర్” తరువాత జరుగుతున్నదిగా ఉండటంతో, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. సమావేశం “సుష్మా స్వరాజ్ భవన్” లో జరగనుంది.
ఈ భేటీలో కేంద్ర క్యాబినెట్ మంత్రులతో పాటు, సహాయ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు వహిస్తున్న మంత్రులు కూడా హాజరుకానున్నారు. సమావేశంలో “ఆపరేషన్ సిందూర్”కు దారితీసిన పరిస్థితులు, ఫలితాలు, భవిష్య కార్యాచరణపై ప్రధాని మోదీ సహచర మంత్రులకు వివరించనున్నట్టు సమాచారం.
భారతదేశ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల్లోకి అందించాల్సిన సందేశం ఎలా ఉండాలి అనే విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. గతంలో జరిగిన ఉగ్రవాద ఘటనలకు ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ గురించి మంత్రులను పూర్తిగా అవగాహన కలిగించేందుకు ప్రధాని ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: America Telugu Sambaralu: జూలై 4 నుంచి మూడురోజుల పాటు NATS ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరాలు
Delhi: ఈ సమావేశంలో మరో ముఖ్యాంశంగా జనాభా లెక్కలు, కుల గణనపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత వారం నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో కుల గణన అంశంపై విశదంగా చర్చించబడింది.
సాధారణంగా కేంద్ర మంత్రి మండలిలో పాలనా విధానాలు, ప్రాజెక్టుల పురోగతి, ప్రజల సమస్యలు వంటి అంశాలపై ప్రధాని ఇతర మంత్రులతో చర్చించటం ఆనవాయితీగా ఉంది. అలాగే, కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టంగా నిర్దేశించే అవకాశం ఉంది. భద్రత, సామాజిక సమగ్రత, పాలనా లక్ష్యాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.