Mahabubabad: మహబూబాబాద్ జిల్లా వడ్డెర కాలనీలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది, దీని గురించి అక్కడి ప్రజలు మిక్కిలి భయంతో వున్నారు. ప్రతి రాత్రి, చీకటి పడగానే ఇళ్లపై రాళ్లు, మట్టి, పెళ్లలు కురుస్తున్నాయి. ఇది గత కొన్ని రోజులుగా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగుతోంది. ఈ అసాధారణ ఘటనతో కాలనీ వాసులు వణికిపోతున్నారు. రాళ్ల శబ్దం, రాత్రంతా ఇళ్లపై రాళ్లు పడుతుండటం ప్రజలను గడప నుంచి బయటకు రాకుండా చేస్తోంది.
రాత్రి అయితే చాలు ప్రతి ఇంటి పై రాళ్ల కుప్పలు కనిపిస్తుండడంతో వారు భయంతో కట్టిపడేసుకున్నారుగా. రాళ్ల వర్షం భయాన్ని కలిగించడంతో, స్థానికులు తమ ప్రాణ రక్షణ కోసం పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సాయం కోరుతున్నారు. ఇదిలా ఉంటే, కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య తన ఇంటి ముందుకు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరి కాయలు పెట్టి, దీపం వెలిగించగా, ఇది చూసి కుటుంబసభ్యులు భయంతో ఇంటిని తాళం వేసి వలస వెళ్లిపోయారు. వారు ఆందోళన చెందుతున్నది ఏదో అనిత్య శక్తి కాలనీని ఆవహించిందని, దెయ్యం లేదా భూతం తమను కట్టిపడేసి ఉండొచ్చని. లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనను సృష్టించి ఉంటారనుకుంటున్నారు.
Also Read: KL Rahul: పాపం ఎప్పుడూ కె ఎల్ రాహుల్ కే అన్యాయం జరుగుతుందా?? గంభీర్ పై మండిపడ్డ సీనియర్ క్రికెటర్
20 సంవత్సరాలు ఇక్కడ నివసిస్తున్న వడ్డెర కులం చెందిన ప్రజలు కూడా ఇప్పుడు భయానికి గురవుతున్నారు. వింతగా జరిగిన ఈ సంఘటనలపై వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. సాంకేతిక విజ్ఞానం వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరింత ఆందోళన కలిగించాయి.
ప్రజలు ఈ ఘటనలు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేస్తోందా అని అనుమానిస్తున్నారు. ఇంకా ఇది ఎందుకు జరుగుతుందో, ఎవరికీ లాభం కలిగిస్తుందో కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు రాత్రంతా గస్తీ నిర్వహిస్తూ, తమ ప్రాణాల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికులు, పోలీసులు, మున్సిపల్ అధికారుల నుండి ఈ భయం మరియు మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందేందుకు సహాయం కోరుతున్నారు.