Ukku Satyagraham: విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో, కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
Ukku Satyagraham: ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్ లో దర్శకులు సత్యారెడ్డి మాట్లాడుతూ, “విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29 న విడుదల కానుంది. తన పదవికి తృణప్రాయం గా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ గారి తో పాటు ఎంతో మంది ఉద్యమకారులని దృష్టి లో ఉంచుకొని ఈ సినిమా కథానాయకుడి పాత్ర గద్దర్ గారు తీర్చిదిద్దారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం” అని అన్నారు.
Ukku Satyagraham: మాజీ సీబీఐ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, “ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు? అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు? అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ సినిమా చూస్తుంటే, ఈ ప్రక్రియలో మనం కూడ భాగస్వామ్యం అవ్వాలని అనిపిస్తుంది. గద్దర్ కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయం. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. ఆయన స్వయంగా నటించిన సినిమా ఇది. ఆయన స్ఫూర్తి ని ఈ సినిమా లో నింపారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, అందరూ సినిమ ని ఆదరిస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డి గారికి కూడా నా అభినందనలు.” అని తెలిపారు.
Ukku Satyagraham: గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ, “ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల తేదీ ని అనౌన్స్ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. గద్దర్ అన్న గారు హైదరాబాద్ నుంచి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కేటాయించారు . స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని కోసం ఈ సినిమా చేసారు గద్దర్ గారు. ఆయన ఈ సినిమా లో నటించినట్టు లేదు, జీవించినట్టు ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
నటీనటులు :
గద్దర్ గారు, సత్యా రెడ్డి, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.
సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీకోటి
ఎడిటర్ : మేనగ శ్రీను
ప్రొడక్షన్ : జనం ఎంటర్టైన్మెంట్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
పి ఆర్ ఓ : మధు VR