UGC:విద్యాసంస్థల్లో పలు రకాల ర్యాగింగ్ వేధింపులతో విద్యార్థులు సతమతం అవుతున్నారు. సీనియర్ విద్యార్థుల నుంచి ఇలాంటి ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఎందరో విద్యార్థులు బలైన ఘటనలూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏదో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో విద్యాసంస్థలు ఆరంభమవుతున్న ఈ వేళ యూజీసీ కీలక ఆదేశాలను జారీ చేసింది.
UGC:వాట్సాప్ గ్రూపుల్లో వేధించినా ర్యాగింగ్ చేసినట్టేనని యూజీసీ తేల్చి చెప్పింది. విద్యాసంస్థల్లో కొత్తగా చేరిన విద్యార్థులను వాట్సాప్ గ్రూపుల్లో కించపరిచేలా మాట్లాడినా అది ర్యాగింగ్ గానే పరిగణించాలని విద్యాసంస్థలకు యూజీసీ ఆదేశాలను జారీ చేసింది. అలా ర్యాగింగ్ చేసిన వారిపై ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంటే గతంలో భౌతికంగా వేధింపులనే పరిగణనలోకి తీసుకునే వారని, ఇప్పుడు మానసికంగా వేధింపులకు గురిచేసినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నమాట.

