Bank Holidays: బ్యాంకు పనులు ఉన్నవారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఈ నెల ఆఖర్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంక్ యూనియన్ల సంఘం నిర్ణయించడమే దీనికి కారణం.అసలే ఆ సమయంలో వరుస సెలవులు ఉండటంతో, సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
వరుసగా సెలవులు ఎలా వస్తున్నాయంటే.. జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం కావడంతో ఎలాగో సెలవు ఉంటుంది. ఆ వెంటనే జనవరి 26న రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా దేశమంతటా సెలవు ఉంది. ఇక జనవరి 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తుండటంతో, వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు.
ఇది కూడా చదవండి: Megastar Chiranjeevi: మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు షాక్.. ఆ విషయంలో హైకోర్టు నోటీసులు
ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో అయితే ఇవాళ్టి నుంచే సెలవులు మొదలయ్యాయి, కాబట్టి అక్కడ ఏకంగా ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.
బ్యాంక్ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే.. వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శనివారం సెలవు ఇవ్వాలని, దానికి బదులుగా రోజుకు 40 నిమిషాల పనివేళలు పెంచుతామని గతంలోనే అంగీకారం కుదిరినా, ప్రభుత్వం మాత్రం రెండేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి నిరసనగానే ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు. అందుకే మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉన్నా, డబ్బులు అవసరమున్నా ఇప్పుడే చక్కబెట్టుకోవడం మంచిది. లేదంటే ఏటీఎంలలో కూడా నగదు కొరత ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
