Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!

Udhayanidhi Stalin: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి అంటూ గతంలో విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.

తమిళనాడులో ఎలక్షన్స్ దగ్గర పడడంతో ప్రచారంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు అతనికి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. ఉదయనిధి స్టాలిన్ గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత బొట్టుని తుడిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీనితో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడే మొదలయింది అసలైన రచ్చ.. వెంటనే ప్రతిపక్ష నేతలు ఉదయనిధి స్టాలిన్ పైన విరుచుకుపడ్డారు. గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చిన ఆయన, ఎలక్షన్స్ రాగానే ఓట్ల కోసం ఆలయాలను సందర్శిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు.

ఎలక్షన్స్ లేకపోయినా, జనాలతో పనిలేకపోయినా డీఎంకే పార్టీకి హిందువులు అవసరం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు విపక్షాల నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *