Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తుక్ అల్ మార్రీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార వాతావరణం, పర్యాటక రంగ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా, విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలోనూ మంత్రి అబ్దుల్లా బిన్ పాల్గొన్నారు. ఈ వేళ ఆయన మాట్లాడుతూ,
దావోస్ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కేవలం ఐదు నిమిషాలు మాట్లాడాను. అయితే ఆ తక్కువ సమయంలోనే ఆయన చూపిన విజన్, ఆలోచనా ధోరణి నాకు చాలా గొప్పగా అనిపించింది. అందుకే మేము అతి తక్కువ సమయంలో – అంటే ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాం,” అని తెలిపారు.
పరిశీలకులు అభిప్రాయపడుతూ, యూఏఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, తాజా ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రానికి విదేశీ మద్దతు మరింతగా లభించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

