UAE Cricketer: ఆసియా కప్ 2025లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఈ సందర్భంగా యూఏఈ ఆటగాడు సిమ్రన్‌జిత్ సింగ్, టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 35 ఏళ్ల సిమ్రన్‌జిత్ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. అతడు గిల్‌తో కలిసి 12 ఏళ్ల క్రితం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) నెట్స్‌లో సాధన చేసిన రోజులను గుర్తుచేసుకున్నాడు.
గిల్‌తో సిమ్రన్‌జిత్ అనుబంధం :
శుభ్‌మన్ గిల్ చిన్నప్పటి నుంచి తెలుసు. 2011-12లో అతడికి 11 లేదా 12 ఏళ్లు ఉండేవి. మేము మొహాలిలోని పీసీఏ అకాడమీలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సాధన చేసేవాళ్లం. గిల్ తన తండ్రితో కలిసి 11 గంటల సమయంలో ప్రాక్టీస్‌కు వచ్చేవాడు. నేను మా సెషన్ తర్వాత కూడా బౌలింగ్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు గిల్‌కు చాలాసార్లు బౌలింగ్ చేశాను. ఇప్పుడు అతడు నన్ను గుర్తుపట్టడో లేదో తెలియదు, అని గత జ్ఞాపకాలను పంచుకున్నాడు.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ .. అన్ని జట్లు ఇవే
ఆసియా కప్ 2025 యూఏఈలో జరుగుతోంది. టోర్నమెంట్ ఆరంభం సందర్భంగా సెప్టెంబర్ 9న అబుదాబిలో రాత్రి 8 గంటలకు హాంకాంగ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.
భారత్‌తో జరిగే ఈ మ్యాచ్ సిమ్రన్‌జిత్ సింగ్‌కు కేవలం అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కాదు, గిల్‌తో ఉన్న పాత జ్ఞాపకాలను తలపిస్తుంది. గిల్ ప్రస్తుతం టీమిండియా కీలక ఆటగాడిగా ఉండగా, సిమ్రన్‌జిత్ యూఏఈ జట్టులో స్పిన్ బౌలర్‌గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌తో తలపడటం తనకు గొప్ప అనుభవమని సిమ్రన్‌జిత్ పేర్కొన్నాడు. ఈ ఆసియా కప్ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉండనున్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.