Andhra Pradesh: నిర్లక్ష్యం..నిర్లక్ష్యం.. ఈ నిర్లక్ష్యమే అనేక కారణాలకు గురి చేస్తుంది.. ఈ నిర్లక్షమే ఎన్నో ప్రాణాలు కోల్పోతుంటారు.. ఇలాంటి ఘటననే ఈ వార్తకు నిదర్శనం.. ఆ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు.. పిల్లలతో కలిసి తల్లిదండ్రులతో సరదాగా ఆటలు, పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఉండేవారు.. ఒకరోజు ఉదయాన్నే పిల్లల తల్లి బయటకు వెళ్లే పనుల్లో బిజీగా ఉండి..నీటి సంపు మూత వేయడం మర్చిపోయి బయటకు వెళ్లింది.. ఆమె నిర్లక్ష్యం వల్ల ఆ చిన్నారి ఈ భూమి మీద లేకుండా పోయింది.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..?
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
Also Read: Crime News: మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డనగేరి గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే రాజబాబు, అతని భార్య లక్ష్మి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. వారిలో రెండేళ్ల వరుణ్ తేజ ఆఖరి సంతానం. నీరు అవసరమై తల్లి లక్ష్మీ ఇంటి ముందు ఉన్న నీటి సంపు తెరిచి నీళ్లు తోడుకుని సంపు మూత మూసి ఇంట్లోకి వెళ్లి పోయింది.
అయితే తొందర్లో సంపు మూత సరిగా మూసుకోకపోవడంతో అక్కడే ఆడుకుంటూ ఉన్న వరుణ్ తేజ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లి చుట్టుపక్కల వెతికింది. చివరికి నీటి సంపులో బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు నీటి సంపులో విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.