Bengaluru

Bengaluru: ఊహించని విషాదం.. వాకింగ్ చేస్తుండగా కూలిన విద్యుత్ స్తంభం.. ఇద్దరు మృతి

Bengaluru: మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు.. నీటి బుడగలాంటిది జీవితం అంటారు. కళ్ల ముందు తిరిగిన వ్యక్తులే.. ఆ కాసేపట్లోనే కనుమరుగు అయిపోవడం నిజంగా విచారకరమే. ఈ మధ్య మరణాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా మరణం కూడా అలాంటిదే. వాకింగ్ వెళ్లిన వాళ్లు.. తిరిగి ఇంటికి రాకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. ఈ ఘోర విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

తమిళనాడుకు చెందిన సుమతి, బీహార్‌కు చెందిన సోని కుమారి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. సోని కుమారి గత ఎనిమిది సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటుంది. సోని కుమారి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఇద్దరూ కూడా వాకింగ్ కోసం బైయప్పనహళ్లి రోడ్డుపై నడుస్తున్నారు. అక్కడే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Also Read: Crime News: భర్తను చంపి.. ప్రియుడితో హనీమూన్ కి వెళ్లిన భార్య

ఆ సమయంలో జేసీబీ యంత్రం హఠాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి.. వాకింగ్ చేస్తున్న ఇద్దరి మహిళలపై పడింది. సంఘటనాస్థలంలోనే మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు జేసీబీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఇక బైయప్పనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bheemili: కుమారైకు అత్తింటి వేధింపులు తండ్రి ఆత్మహత్య!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *