Crime News: జనగామ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. లింగాలగణపురం మండలం పిట్టలోనిగూడెం గ్రామంలో కాలియా కనకయ్య (30) అనే వ్యక్తిని ఆయన ఇద్దరు భార్యలే కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కనకయ్యను ఆయన ఇద్దరు భార్యలు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: KTR: అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమే.. కానీ మైక్ కట్ చేయకుండా ఉంటారా
కాగా, మృతుడు కాలియా కనకయ్య గతంలో తన అత్తను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. ఈ కేసుతో ప్రస్తుత హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

