Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాద వివరాలు, తీవ్రత
బిలాస్‌పూర్ సమీపంలోని జైరామ్‌నగర్ స్టేషన్ ప్రాంతం. కోర్బా ప్యాసింజర్ రైలు (లోకల్ రైలు) మరియు గూడ్స్ రైలు. కోర్బా ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
BREAKING: Passenger train collides with a goods train on the Bilaspur–Howrah route, causing multiple coaches to derail. Casualties feared. pic.twitter.com/D5t9rLZAEe
— Vani Mehrotra (@vani_mehrotra) November 4, 2025
