Viral News

Viral News: ఛీ ఛీ.. తమ భర్తలను మార్చుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు

Viral News: కాలంతో పాటు మనుషులు, వారి ఆలోచనలు కూడా మారిపోతుంటాయి. ఈ ఆధునిక యుగంలో ఏది మంచి, ఏది చెడు అనే నైతిక విలువలు కూడా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బడాబాబుల పార్టీలలో భార్యల మార్పిడి (Wife Swapping) సంస్కృతి కొన్నిచోట్ల వెలుగు చూస్తుంటుంది. అయితే, దానికి పూర్తి భిన్నంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ భర్తలను పరస్పరం మార్చుకున్నారు. అంతేకాదు, వారి పిల్లలను కూడా మార్చుకోవడం ఇక్కడ ట్విస్ట్.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్‌పూర్ జిల్లాలోని పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక రైతు తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. వారు తమ భర్తలు, పిల్లలతో సంతోషంగానే కాపురం చేస్తున్నారు. కానీ, ఆరు నెలల క్రితం వారి జీవితాల్లో ఊహించని మార్పు వచ్చింది.

ఎలా మొదలైంది ఈ వింత బంధం?

  • ముందుగా, చిన్న కూతురు తన అక్క భర్తతో ప్రేమలో పడింది. ఈ బంధం అక్రమ సంబంధానికి దారి తీసింది.
  • ఆరు నెలల క్రితం, ఈ ఇద్దరూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయారు.
  • వారి కోసం వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి, వీరు ఇద్దరూ ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: AFG vs BAN: బంగ్లాదేశ్‌ చేతిలో క్లీన్ స్వీప్.. వరుస పరాజయాలతో ఢీలా పడుతున్న ఆఫ్ఘనిస్తాన్

ఆ తర్వాత మరో ట్విస్ట్..

చిన్న కూతురు పారిపోయిన తర్వాత, ఒంటరిగా ఉన్న పెద్ద కూతురు కూడా ఊహించని నిర్ణయం తీసుకుంది. చిన్న కూతురు పారిపోయిన ఆమె భర్తతో ప్రేమాయణం నడిపిన అక్క కూడా చివరకు అతడిని పెళ్లి చేసుకుంది. ఇటీవల, భర్తలను మార్చుకున్న ఈ నాలుగు మూర్తులు (అక్క, ఆమె కొత్త భర్త; చెల్లి, ఆమె కొత్త భర్త) అత్తారింటికి తిరిగి వచ్చారు.

రాజీకి వచ్చి… పిల్లలను కూడా మార్చుకున్నారు

ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ పెద్దలు, గ్రామస్థులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కానీ, ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తమ భర్తలను మార్చుకోవడానికి అంగీకరించారు. విచిత్రం ఏమిటంటే, ఈ రాజీలో భాగంగా వారు తమ పిల్లలను కూడా పరస్పరం మార్చుకున్నారు.

  • పెద్ద కూతురు పిల్లలను చెల్లెలికి అప్పగించింది.
  • చిన్న కూతురు పిల్లలను అక్కకు ఇచ్చేసింది.

ఈ విధంగా, అక్కాచెల్లెళ్లిద్దరూ తాము ప్రేమించిన వ్యక్తులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

తండ్రి కఠిన నిర్ణయం

కూతుళ్ల ఈ అసాంఘిక, అనాగరికమైన బంధాలను చూసిన తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామంలో కుటుంబ పరువు పూర్తిగా పోవడంతో, ఆయన ఈ పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఆ రైతు కఠిన నిర్ణయం తీసుకుని, ఆ నలుగురినీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. అంతేకాకుండా, ఇద్దరు కూతుళ్లతో ఉన్న బంధాలను తెంచుకున్నట్లు కూడా ఆయన స్థానిక పోలీసులకు, గ్రామస్థులకు వెల్లడించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *