War 2 Business: తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ సినిమా భారీ అంచనాలతో బజ్ సృష్టించినప్పటికీ, ఊహించని ట్విస్ట్‌తో YRF ముందుకు సాగుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోతో రూ. 90-110 కోట్లకు తెలుగు రైట్స్ అమ్మాలని YRF భావించింది. ఆసియన్ సినిమాస్ రూ. 70 కోట్లు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ. 80 కోట్లు ఆఫర్ చేసినా, డీల్ ఫైనల్ కాలేదు. టీజర్ అంచనాలను అందుకోలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు రూ. 60 కోట్లకు మించి రిస్క్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో YRF సొంతంగా రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.
గతంలో ‘దేవర’ సమయంలో ఎన్టీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని డీల్ కుదుర్చినా, ఈసారి ‘వార్ 2’ విషయంలో ఆయన డిస్ట్రిబ్యూషన్‌లో పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదని సమాచారం. YRF ధైర్యంగా సొంత రిస్క్ తీసుకుని తెలుగు మార్కెట్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ బిగ్ బెట్ విజయవంతమవుతుందా? అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.