Tvk vijay: మరోసారి విజయ్ కు సీబీఐ నోటీసులు

Tvk vijay: తమిళ సినిమా స్టార్, టీవీకే అధినేత విజయ్‌కు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు వేగవంతం చేస్తూ ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ నోటీసులు కేసుకు సంబంధించిన కీలక అంశాలపై మరిన్ని వివరాలు అవసరమని సూచిస్తున్నాయి

ఇదే కేసులో భాగంగా విజయ్ నిన్న సీబీఐ విచారణకు హాజరై సుమారు ఏడు గంటల వరకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో బాధితులు ఎవరు, కార్యక్రమ నిర్వహణలో ఏమి జరిగిందో, భద్రతా లోపాలపై తమకు తెలిసిన సమాచారాన్ని విజయ్ నుంచి సీబీఐ సేకరించింది.

జరిగిన తర్వాత రాజకీయ, సామాజికంగా పెద్ద చర్చ నెలకొంది. బాధితుల కుటుంబాలకు న్యాయం అందించేందుకు కేసును సీబీఐకు బదిలీ చేశారు. ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకోగా, విజయ్ మరోసారి విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాతే కేసు తదుపరి దిశ స్పష్టమవుతుందని అంచనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *