Tummla nageshwar Rao: తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఓ కీలక ప్రకటనలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వర్క్ టూ ఓనర్” పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, కేంద్ర పథకాలపై రాష్ట్రాల హక్కును హైలైట్ చేశారు.
మంత్రి తుమ్మల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
ఇది నీ అబ్బ సొత్తు కాదు.. మా అబ్బ సొత్తు కాదు
ప్రభుత్వ పథకాలకు ఖర్చయ్యే నిధులు ప్రజల పన్నుల రూపంలో వస్తాయని, అవి కేంద్రం గాని, రాష్ట్రం గాని స్వంతంగా పెట్టే డబ్బులు కాదని స్పష్టం చేశారు.
“కేంద్రానికి 70 పైసలు ఇస్తే.. 30 పైసలు ఇస్తున్నారు”
రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో అది మర్చిపోకూడదని మంత్రి అన్నారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంతో ఉందని ఆయన గుర్తు చేశారు.
“కేంద్రాన్ని కాపాడేది రాష్ట్ర ప్రభుత్వాలు”
దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ఎంతో ముఖ్యమని, కేంద్రం పనిచేయాలంటే రాష్ట్రాల సహకారం అవసరమని మంత్రి పేర్కొన్నారు.
“ఎవరిదో ఫొటో పెట్టాలంట..! మేం పన్నులు కడుతున్నాం.. మా సీఎం ఫొటో పెట్టాలి”
పథకాలపై కేవలం కేంద్ర నేతల ఫొటోలను మాత్రమే పెట్టకూడదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి వాటా నిధులు ఇస్తున్నాయనీ, కావున రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండడం సమంజసమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
.

