Tummala Nageshwar Rao: తెలంగాణ రైతులకు యూరియా కొరత సమస్య నుంచి ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు అంగీకరించింది.
ఈ నిర్ణయం ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు చేపట్టిన ఆందోళన ఫలితంగా వచ్చింది. వెంటనే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి యూరియా రవాణా చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
“వారం రోజుల్లో తెలంగాణకు యూరియా చేరుకుంటుంది” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు.