TTD: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక శోభను విస్తరించాలనే దిశగా పయనిస్తున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన తిరుమల ఆలయాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చొరవ తీసుకున్నారు.
TTD: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీ వారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలాలు కేటాయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో చైర్మన్ బీఆర్ నాయుడు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు పంపారు.
TTD: దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమని పేర్కొన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని తెలిపారు.