YV Subba Reddy

YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సంచలనం.. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్ బృందం!

YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడకం కేసు ఇప్పుడు పెద్ద మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డిను సిట్ బృందం ఆయన ఇంట్లోనే విచారిస్తోంది. ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ అయిన చిన్న అప్పన్నతో పాటు, టీటీడీ మాజీ ఈవో మరియు ఇతర అధికారులను సిట్ విచారించింది. ఆ విచారణల్లో వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సిట్ అధికారులు విచారణ కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు మరియు స్టేట్‌మెంట్లను వెంట తెచ్చుకున్నారు. వాటిని ముందు ఉంచి ఆయనను నిశితంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన విరామం తరువాత విచారణ మళ్లీ కొనసాగనుంది.

Also Read: Alert In Sabarimala: శబరిమల భక్తులకు అలెర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

పీఏ అరెస్టు, కస్టడీలో కీలక వివరాలు
ఈ కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన చిన్న అప్పన్న (A24) ను సిట్ అధికారులు గత నెల చివర్లో అరెస్టు చేశారు. ఆయనను మొదట నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం, కేసు విచారణలో మరింత లోతుగా వెళ్లడం కోసం చిన్న అప్పన్నను తమ కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం దానికి అంగీకరించి, ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే, గత సోమవారం (నవంబర్ 17) ఉదయం చిన్న అప్పన్నను నెల్లూరు జైలు నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి, వైద్య పరీక్షలు పూర్తి చేసిన తరువాత విచారణ జరిపారు. ఆయన కస్టడీ విచారణలో వెల్లడైన కీలక సమాచారం, అధికారుల వాంగ్మూలాల ఆధారంగానే ఇప్పుడు సిట్ బృందం వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే విషయాలు ఈ విచారణ ద్వారా బయటపడే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *