POLYCET Results 2025: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలిసెట్ (TS POLYCET 2025) ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) కార్యదర్శి బి. శ్రీనివాస్ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం ఈ పరీక్షకు 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది విద్యార్థులు హాజరయ్యారు.
వివరాల్లోకి వెళ్తే, బాలురలో 92.84%, బాలికలలో 92.4% హాజరైనట్లు అధికారులు తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్‌ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
ఫలితాలను ఇలా చెక్ చేయాలి:
-
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి – https://www.polycet.sbtet.telangana.gov.in
-
హోమ్‌పేజీలో కనిపించే “POLYCET 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి
-
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
-
Submit బటన్‌పై క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది
-
భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకండి
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ త్వరలోనే…
ఫలితాల విడుదల అనంతరం TS POLYCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయబడతాయి. ఇందులో:
-
85% స్థానిక అభ్యర్థులకు
-
15% స్థానికేతర అభ్యర్థులకు కేటాయింపు ఉంటుంది
విడతల వారీగా సీట్ల భర్తీ జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను నిత్యం పరిశీలించాలి.
టీజీఆర్‌జేసీ సెట్ 2025 ఫలితాలు కూడా విడుదల
మరోవైపు, టీజీఆర్‌జేసీ సెట్ 2025 ఫలితాలను కూడా తాజాగా విడుదల చేశారు. మే 10న నిర్వహించిన ఈ పరీక్షకు 61,476 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు నిర్వహించబడింది. ఇందులో కనీస అర్హత మార్కులు ఉండవని, విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తామని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్. రమణకుమార్ తెలిపారు.
ఇంటర్మీడియట్ కోర్సుల కోసం 3000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏ కాలేజీలో సీటు వచ్చినదీ మే 24న SMS ద్వారా తెలియజేస్తామని సంస్థ ప్రకటించింది.
ముఖ్య సమాచారం ఒక్క క్లిక్‌తో…
👉 ఫలితాల లింక్: https://www.polycet.sbtet.telangana.gov.in
👉 కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం అదే వెబ్‌సైట్‌ను సందర్శించండి
👉 స్పాట్ అడ్మిషన్లు, సీటు కేటాయింపులపై వివరాలు త్వరలో విడుదల అవుతాయి.