Ts Assembly Sessions: ఈనెల 9నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు, పంచాయితీ రాజ్ చట్ట సవరణ, నూతన ఆర్వోఆర్(రికార్డ్స్ ఆఫ్ రైట్స్)చట్టం, రిజర్వేషన్లపై బీసీ డెడికెషన్ కమిషన్ రిపోర్ట్ బిల్స్ ని సభలో ప్రవేశ పెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం, రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చ జరపనున్నారు. హైడ్రా, మూసి పునరుజ్జీవం, రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్, విద్యుత్ కమిషన్ రిపోర్ట్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫోన్ ట్యాపింగ్‌పై చర్చించే అవకాశం, ఏడాది ప్రజా పాలన – విజయాలపై సభలో స్వల్పకాలిక చర్చ పెట్టనున్న ప్రభుత్వం.
