TS 10th Class Results 2025: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:15కి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్థులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.inలలో ఫలితాలు చూసుకోవచ్చు.
విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ పుట్టిన తేదీ ఉపయోగించి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల్లో పాస్/ఫెయిల్ స్థితి కూడా స్పష్టంగా చూపించారు.
ఈ సంవత్సరం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 16 వరకు జరిగింది. మార్కుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసిన విద్యాశాఖ, ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది.
ఈ సంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానంలో మార్పులు చేసారు. ఇప్పుడు విద్యార్థులకు సబ్జెక్ట్ వారీగా మార్కులతో పాటు గ్రేడులు కూడా ఇవ్వబడుతున్నాయి. ఇది విద్యార్థులకు తమ ప్రతిభను బాగా అర్థం చేసుకునేలా సహాయపడుతుంది. పూర్వంలా GPA ఇవ్వకుండా, ప్రతీ సబ్జెక్ట్‌కు విడివిడిగా మార్కులు చూపించారు.
Also Read: Telangana: రాపిడోతో రవాణా శాఖ ఒప్పందం
అమ్మాయిలదే ఆధిక్యం
ఇప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలే మెరుగైన ఫలితాలు సాధించారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 98.2%గా నమోదైంది, ఇది రాష్ట్ర విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది.
విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లను సందర్శించవచ్చు. మార్కుల మెమోను ప్రింట్ తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధం కావచ్చు.
ఇంకా సమాచారం కోసం :
👉 https://results.bse.telangana.gov.in
