Elon Musk

Elon Musk: నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయినవారు – మస్క్‌

Elon Musk: టెస్లా సీఈఓ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X అధినేత ఎలాన్ మస్క్ తాజా వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2024 అమెరికా ఎన్నికల ప్రణాళికలపై తన మద్దతు ఎంత కీలకమో స్పష్టం చేస్తూ, “నా మద్దతు లేకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యేవాడు” అంటూ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ, తాను మద్దతు ఇవ్వకపోతే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కూడా ప్రతినిధుల సభలో అధికారం కోల్పోయేదని, సెనెట్‌లో వారికి కేవలం 51-49 స్థానాలు మాత్రమే దక్కేవని తెలిపారు. తన మద్దతు వలన రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఉండగలిగిందని ఆయన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ప్రతిస్పందించారు. మస్క్ మద్దతు తనకు అవసరం లేదని, తాను మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో గెలవగలిగానని స్పష్టం చేశారు. అదేవిధంగా, మస్క్ వ్యాపారాలకు ఇస్తున్న ప్రభుత్వ రాయితీలను, కాంట్రాక్టులను తగ్గిస్తామని హెచ్చరించారు. మస్క్ ప్రభుత్వ ఖర్చులను తగ్గించే బిల్లును వ్యతిరేకించడం తనకు ఆవేదన కలిగించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read: Kolkata: మహువా మొయిత్రా – పినాకి మిశ్రా పెళ్లి వార్తలతో రాజకీయ వర్గాల్లో చర్చ

Elon Musk: కొందరికి స్నేహితులు, మరికొంత మందికి వ్యాపార భాగస్వాములుగా కనిపించిన మస్క్–ట్రంప్ మధ్య ఇప్పుడు గగనానికి ఎగసిన మాటల యుద్ధం నడుస్తోంది. ట్రంప్ ఇటీవల మస్క్‌కు బంగారు కీ అందజేయగా, కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ట్రంప్ మద్దతుదారులు వ్యతిరేకంగా ఓటేయడంతో బడ్జెట్ బిల్లు ఫాసయ్యింది. మస్క్ దీనిపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ రాజకీయ పరిణామాల్లో మస్క్ సోషల్ మీడియాలో అభిమానులకు “కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చా?” అని ప్రశ్నించారు. “అమెరికాలో 80% మందికి సరైన ప్రతినిధ్యం లేనప్పుడు, కొత్త పార్టీ తగిన సమయం కావచ్చా?” అని సూచించారు. ఇది ఆయన రాజకీయ రంగంలో కొత్త అడుగులు వేయబోతున్నట్లు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *