Donald Trump

Donald Trump: త్వరలో ఇండియాకు డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump: వచ్చే ఏడాది తాను భారత్ లో పర్యటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తిగా, మిత్రుడిగా అభివర్ణించారువైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా దిగుమతి సుంకాలు (Tariffs) వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: The Girlfriend Review: కోతగా రష్మిక.. ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ఎలావుందీ అంటే..?

వచ్చే ఏడాది భారత్‌ పర్యటనకు ప్రణాళికలు ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించగా, “ఉండవచ్చు, అవును” అని ట్రంప్ బదులిచ్చారు. ట్రంప్ పర్యటన ఖరారైతే, ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని భావిస్తున్నారు. ప్రముఖ ఊబకాయం మందుల ధరల తగ్గింపు లక్ష్యంగా పలు ఫార్మా కంపెనీలతో ట్రంప్‌ కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం గురించి వైట్‌హౌస్‌లో విలేకరులకు వివరిస్తుండగా.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ పక్కన ఉన్న.. ఓ ఫార్మాస్యూటికల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దీంతో కార్యక్రమానికి కొంతసేపు అంతరాయం కలిగింది. పడిపోయిన వ్యక్తి నోవో నార్డిస్క్‌ ఎగ్జిక్యూటివ్‌ గోర్డాన్‌ ఫైండ్లేగా తెలుస్తోంది. ఈ సంఘటనపై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్ మాట్లాడుతూ.. ఆయన స్పృహ తప్పారని వెల్లడించారు. వైట్‌హౌస్‌ వైద్యబృందం వెంటనే స్పందించి ఆయనకు చికిత్స అందించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *