Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన అణు ఉద్రిక్తతలకు తన హస్తక్షేపం వల్లే బ్రేక్ పడిందని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న తీవ్రమైన పరిస్థితులను తాను చర్చల ద్వారా సమసిపర్చానని తెలిపారు.
“భారత్, పాక్ మధ్య అప్పట్లో పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా మారింది. దాడులు మానేయాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని నేను సూచించాను,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలూ గర్జనలు ఆపకపోతే, అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ప్రభావం ఉంటుందని తాను స్పష్టం చేశానని అన్నారు.
అణు ఆయుధాల విషయంలో రెండూ దేశాలు ప్రగాఢంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని సూచించానని ట్రంప్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో అమెరికా పాత్రపై చర్చకు దారి తీశాయి.