Kavya Maran: సౌతాఫ్రికా టీ20 లీగ్ SA20 నాలుగో సీజన్ కోసం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తాజా వేలంలో జట్లు భారీగా బిడ్లు వేస్తూ స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కూడా జట్టులో కీలక మార్పులు చేసింది. రెండు సీజన్లకు విజేతలుగా నిలిచిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్థానంలో జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
ట్రిస్టన్ స్టబ్స్‌కు పెద్ద బాధ్యత
25 ఏళ్ల స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2026 సీజన్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మొదటి సీజన్ నుంచే జట్టులో కీలక ఆటగాడిగా నిలిచిన స్టబ్స్, తన అగ్రెసివ్ బ్యాటింగ్, అద్భుత వికెట్ కీపింగ్‌తో జట్టుకు అనేక విజయాలు అందించాడు. SA20లో ఇప్పటివరకు 140.11 స్ట్రైక్ రేట్‌తో 723 పరుగులు సాధించిన స్టబ్స్, తన అద్భుత ప్రదర్శనతో మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు.
మార్క్రమ్ గతంలో 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్‌కు కెప్టెన్సీ అందించి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఈ సీజన్ వేలంలో ఆయనను డర్బన్ సూపర్ జెయింట్స్ (DSG) రూ.7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. దాంతో జట్టు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఆందోళనలో అభిమానులు: అర్థరాత్రి ఆసుపత్రికి వెళ్లిన రోహిత్ శర్మ
వేలంలో కొత్త ఆటగాళ్ల జోడింపు
ఈస్టర్న్ కేప్ వేలానికి ముందే స్టబ్స్‌ను రిటైన్ చేయగా, ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్‌స్టో ను ప్రీ-సైన్ చేసుకుంది. వేలంలో క్వింటన్ డి కాక్, ఎన్రిక్ నోర్ట్జే, సెనురాన్ ముత్తుసామి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును మరింత బలపరిచింది.
View this post on Instagram
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పూర్తి జట్టు:
- ట్రిస్టన్ స్టబ్స్ (కెప్టెన్)
- జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్)
- క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్)
- మాథ్యూ బ్రీట్జ్కే
- అల్లాహ్ గజన్‌ఫర్
- మార్కో జాన్సెన్
- ఆడమ్ మిల్నే
- ఎన్రిక్ నోర్ట్జే
- జోర్డాన్ హర్మన్
- సెనురాన్ ముత్తుసామి
- లూయిస్ గ్రెగొరీ
- పాట్రిక్ క్రుగర్
- బేర్స్ స్వాన్‌పొల్
- లుథో సిపామ్లా
- మిచెల్ వాన్ బురెన్
- క్రిస్ వుడ్
- సీజే కింగ్
- జేపీ కింగ్
ఈ కొత్త స్క్వాడ్‌తో సన్‌రైజర్స్ మూడోసారి టైటిల్‌ను గెలుచుకునే ప్రయత్నం చేయనుంది. జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మిశ్రమం ఉండటంతో రాబోయే సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు.
