Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్‌లో సోమవారం ఈ అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఆ ముగ్గురిలో ఒకరు ఆడ, మిగతా ఇద్దరు మగ శిశువులు కలిగారు. వారు ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ అశ్వినీ, డాక్టర్ వినీషారెడ్డి, డాక్టర్ బిందు సాగర్ పాల్గొన్నారు.

