బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.గత నాలుగు రోజుల వ్యవధిలో ఆగంతకులు ఇలా 35 ఫేక్ కాల్స్ చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్‌లో బాంబులు పెట్టినట్లుగా ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం వారు ఫ్లైట్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు.
అయితే, అక్కడ భద్రతా ఏజెన్సీ నుంచి పూర్తి అనుమతులు వచ్చాకే ఫ్లైట్ అక్కడి నుంచి బయలుదేరనున్నట్లుగా తెలుస్తోంది.