తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆయా స్కూళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఎవరు పంపారనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.