రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై – రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటం చాలా ముఖ్యం. అలా జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదంలో పడటం ఖాయం. అలా ఇబ్బందుల్లో పడి తృటిలో ప్రాణాలు కాపాడుకున్న సంఘటన కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ వీడియో ఫుటేజీలో, ఒక మహిళ, తన చేతుల్లో బిడ్డను పట్టుకుని, తన స్నేహితులతో కలిసి రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తోంది. మొబైల్ సంభాషణలో బిజీగా ఉన్న ఆమె అటూ ఇటూ గమనించకుండా నేరుగా రైల్వే ట్రాక్ దాటేందుకు వెళ్లింది. అప్పుడు వెనుక నుంచి వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది.
— Horror Mistake (@Horror_clip) September 16, 2024
రైలు ఢీకొనడంతో ఆమె దూకి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. అయితే, ఈ ఘటనలో ఆమె, ఆమె చేతిలో ఉన్న చిన్నారి ప్రాణాపాయం నుంచి అద్భుతంగా బయటపడ్డారు. వెనుక నుంచి రైలు తన వైపు వస్తోందని ఆమె తెలియక నడుచుకుంటూ వెళుతుండగా, రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సాయం చేసేందుకు పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మహిళ, చిన్నారి పరిస్థితి ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
అందువల్ల, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై లేదా రోడ్లపై, ముఖ్యంగా పిల్లలతో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త చర్య విపత్తుకు దారి తీస్తుంది. రోడ్డు కానీ, రైల్వే ట్రాక్ కానీ దాటే ముందు, అటూ ఇటూ ఏ వాహనం లేదా రైలు రావట్లేదని నిర్ధారించుకుని క్రాస్ చేయాలి.

