Train Collision: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు ట్రాక్ పై ఆగి ఉండగా, వెనుక నుంచి వచ్చిన మరో గూడ్స్ రైలు దానిని ఢీకొట్టింది. ఢీకొన్న ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో, ముందు నిలబడి ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్, గార్డు కంపార్ట్‌మెంట్ ట్రాక్‌పై నుండి పక్కకు పడిపోయాయి.
ఈ ప్రమాదంలో రెండు రైళ్లలోని లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం DFC అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో జరిగింది. ఈ ట్రాక్ పై కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయి.అందువల్ల ఈ సంఘటన ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం చూపలేదు. సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: BRS: సత్యవతి రాథోడ్, కేపీ వివేకానందకు బీఆర్ఎస్ కీలక పదవులు.. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్‌షాక్
రెండు రైళ్లలోని లోకో పైలట్లను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. సహాయ, రక్షణ కోసం బృందాలు వచ్చాయి. ట్రాక్ క్లియర్ చేస్తున్నారు. కాన్పూర్-ఫతేపూర్ మధ్య ఖాగాలోని పంభీపూర్ సమీపంలోని అప్ లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
రెడ్ సిగ్నల్ వద్ద ఆగిన గూడ్స్..
. ట్రాక్ పై రెడ్ సిగ్నల్ ఉందని DFC అధికారులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో, ఒక గూడ్స్ రైలు నిలబడి ఉంది. అప్పుడు అకస్మాత్తుగా వెనుక నుండి ఒక గూడ్స్ రైలు అతి వేగంగా వచ్చి దానిని ఢీకొట్టింది. రెండు గూడ్స్ రైళ్లలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ అవుతోంది. ప్రమాదం కారణంగా, సరుకు రవాణా కారిడార్‌లోని ఒక లైన్‌లో రైలు రాకపోకలు ప్రభావితమయ్యాయి. అనేక గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. కొన్నింటి మార్గాలు మార్చారు. రైల్వే యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది.

