Train Accident in Thailand: థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం ఒక భయంకరమైన రైలు ప్రమాదం సంభవించింది. నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి కదులుతున్న రైలుపై పడటంతో ఈ అనర్థం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 22 మంది ప్రయాణికులు మరణించగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగింది?
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని సిఖియో జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అక్కడ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ అకస్మాత్తుగా పట్టాలపై వెళ్తున్న ప్రయాణికుల రైలుపై జారిపడింది.
ఇది కూడా చదవండి: Amitov Teja: దర్శకుడు తేజ కుమారుడికి టోకరా.. రూ. 63 లక్షలు గోవిందా !
పట్టాలు తప్పిన బోగీలు.. చెలరేగిన మంటలు
క్రేన్ పడిన వేగానికి రైలు బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీల్లో మంటలు కూడా చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాద సమయంలో రైలులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
సహాయక చర్యలు ముమ్మరం
గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రేన్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో థాయ్‌లాండ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
🇹🇭CRANE DISASTER: 12+ DEAD AS HIGH-SPEED RAIL EQUIPMENT CRUSHES THAI TRAIN🚨
A massive construction crane working on a high-speed rail project collapsed onto a passing passenger train in Thailand’s Sikhio district Wednesday morning.
The heavy impact derailed carriages and… pic.twitter.com/sFmEEG1Aci
— Info Room (@InfoR00M) January 14, 2026
