Train Accident

Train Accident: స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి

Train Accident: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం  ఘోర  ప్రమాదం జరిగింది. స్కూల్‌కు తీసుకెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ పైన  రైలు దూసుకెళ్లడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చెమ్మంగుప్ప అనే ప్రాంతంలో జరిగింది.

పూర్తి వివరాలు ఇవే..

స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లే క్రమంలో రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. కానీ రైల్వే గేట్‌ కీపర్‌ నిర్లక్ష్యం కారణంగా గేట్‌ వేయలేదు. అంతే కాదు.. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకపోవడంతో అతని నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెచ్చింది.


దాంతో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వేగంగా వచ్చిన రైలు వెనక నుంచి ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకుపోయింది. ఈ దుర్ఘటనలో స్కూల్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

చిన్నారుల ఆర్తనాదాలు.. తల్లిదండ్రుల కన్నీరు

ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా,  పది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Harish Rao: నేడు మ‌రోసారి కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు హ‌రీశ్‌రావు


ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పిల్లలు ఆరోగ్యంగా స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తారని ఆశించిన తల్లిదండ్రులు, తమ పిల్లలను ఇలా శవాలుగా చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

గేట్ కీపర్‌పై ఆగ్రహం..

ఈ ఘటనకు కారణమైన గేట్ కీపర్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని చితకబాదారు. పోలీసులు గేట్ కీపర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరుపుతున్నారు.

ఇదేంటీ పరిస్థితి?

వేసవి సెలవులు ముగిసిన తర్వాత స్కూల్‌లు ప్రారంభమై నెల రోజులే అవుతోంది. ఈ మధ్య తరచుగా స్కూల్ బస్సులు, వ్యాన్లు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏపీ రాష్ట్రంలో కూడా ఓ చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి ప్రాణం కోల్పోయింది.

చివరగా..

ఈ ఘటనను చూస్తే.. చిన్నారుల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నట్లుగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లతో పాటు, రైల్వే అధికారులు, గేట్ కీపర్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Government Hospitals: ప్రభుత్వ ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *