Nirmal

Nirmal: బతుకమ్మ పండుగలో విషాదం: ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డీజే

Nirmal: నిర్మల్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీజే సౌండ్‌ బాక్సుల మోత మధ్య బతుకమ్మ ఆడుతున్న ఇద్దరు మహిళలు గుండెపోటుతో మరణించారు. ఈ దుర్ఘటనలు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రాత్రి జరిగాయి. నిర్మల్‌లోని బంగల్‌పేట్‌ కాలనీలో శనివారం అర్ధరాత్రి వేడుకలు జరుగుతున్న సమయంలో బిట్టింగు భాగ్యలక్ష్మి (56) అనే మహిళ డీజే శబ్దంతో బతుకమ్మ ఆడుతుండగా, ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

Also Read: Bus Fares Hike: తెలంగాణ బస్సు చార్జీలు పెంపు: నేటి నుంచి అదనపు భారం

అలాగే, ఇదే జిల్లాలోని భైంసా మండలం వానల్‌పాడ్‌ గ్రామంలో మరో విషాదం జరిగింది. కేవలం ఐదు నెలల క్రితమే వివాహం చేసుకున్న రుషిత (22) అనే నవ వధువు కూడా డీజే సౌండ్‌తో బతుకమ్మ పాటలు పెట్టుకుని ఆడుతుండగా అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స అందించిన తర్వాత, భైంసాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ప్రారంభం కాకముందే రుషిత ప్రాణాలు కోల్పోయింది. ఈ రెండు ఘటనల్లోనూ డీజే సౌండ్ అతిగా ఉండటం, దాని ప్రభావంతోనే మహిళలు గుండెపోటుకు గురైనట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బతుకమ్మ

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *