Hyd News

Hyd News: సికింద్రాబాద్ లో విషాదం: అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Hyd News:  సికింద్రాబాద్..ఖార్కాన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్ లో అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతో పాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అపార్ట్మెంట్ లో నుండి దుర్వాసన వస్తుండడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అపార్ట్మెంట్లోని నాలుగవ అంతస్తులో నివాసముంటున్న వీణ,మీనా ల నివాసం నుండి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన పోలీసులు తలుపు తెరిచి చూడగా కుళ్ళిన స్థితిలో హాల్ లోని మంచంపై వారి మృతదేహాలు గుర్తించారు. వెంటనే కార్ఖానా పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: america: చైనాకు భారీ షాకిచ్చిన ట్రంప్..

Hyd News: కార్ఖానాలోని ఓ అపార్ట్మెంట్ లో వీణ(60), వాణి(59) అక్కాచెల్లెళ్లు గత 12 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఓకే ఫ్లాట్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.వీణ,మీనా లు తన చెల్లెలు సాధనతో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవారని గత పది రోజుల క్రితం చివరగా ఫోన్ చేసినట్లు తెలిపారు. వీరి కుటుంబంలో ఏడు మంది కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా వారిలో ఇద్దరు ఇదివరకు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. వీరి తండ్రి ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందినట్లు పోలీసులు తెలిపారు. అపార్ట్మెంట్ వాసులతో మీనా,వాణి లు సరిగా మాట్లాడే వారు కాదని, వారి మానసిక స్థితి కూడా సరిగా ఉండేది కాదని పోలీసులు తెలిపారు.ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.వారం రోజుల క్రితమే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *