Bihar:బిహార్ రాష్ట్రంలో మరణ మృదంగం వినిపిస్తూనే ఉన్నది. నిత్యం ఏదో ఒక చోట కల్తీ మద్యం మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీ మద్యం మహమ్మారిలా మారి ఆ రాష్ట్ర ప్రజానీకాన్ని హరించి వేస్తున్నది. మద్య నిషేధం అమలులో ఉన్న ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుండటం ఆందోలన కలిగిస్తున్నది. తాజాగా కల్తీ మద్యం సేవించి 27 మంది చనిపోగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు చోటుచేసుకోవడం విషాదకరం.
Bihar:బిహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని మఘార్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం తాగిన 22 మంది, సరణ్ జిల్లాలోని ఇబ్రహీంపూర్‌లో మరో ఐదుగురు మృతిచెందారు. ఆయా ప్రాంతాలకు చెందిన మరో 25 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. బాధితుల్లో చాలా మంది కంటిచూపును కోల్పోయినట్టు తెలుస్తున్నది. ఇంకా బాధితులు ఎంత మందో తేలాల్సి ఉన్నది.
Bihar:కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలపై బిహార్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కల్తీ మద్యం ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా ఓ పరిష్కారాన్ని మాత్రం చూపలేకపోతున్నారు.